Advertisement
Google Ads BL

NBK107: బాలయ్య సెకండ్ లుక్ పై ట్రోల్స్


నిన్న మే 28 న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం NBK 107 నుండి దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య పవర్ ఫుల్ లుక్ ఒకటి వదిలి నందమూరి ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ఆ లుక్ లో బాలకృష్ణ ఎనర్జిటిక్ గా, వైట్ అండ్ వైట్ డ్రెస్ తో చేతిలో కత్తి తో కనిపించారు. బాలయ్య ఫాన్స్ కి ఆ లుక్ చూడగానే పూనకలొచ్చేశాయి. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో NBK 107 సెకండ్ లుక్ పై ట్రోల్స్ నడిచాయి.

Advertisement
CJ Advs

అంటే చాలా సినిమాల్లో సమరసింహారెడ్డి దగ్గర నుండి నిన్నమొన్నటి అఖండ సెకండ్ కేరెక్టర్ వరకు బాలయ్య బాబు వైట్ అండ్ వైట్ లుక్ తోనే చేతి లో కత్తితో కనిపిస్తున్నారు. NBK 107 ఫస్ట్ లుక్ లో స్టయిల్ గా, మాస్ గా బ్లాక్ షర్ట్ లో మాస్ ఫాన్స్ ని ఉర్రుతలూగించిన బాలకృష్ణని.. సెకండ్ లుక్ విషయంలో తేల్చేసారు. ఇంకాస్త కొత్తగా ట్రై చేస్తే బావుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. బాలయ్యని లెజెండ్, సింహ, అఖండ లో పవర్ ఫుల్ గా చూసేసాం.. ఇంకా ఆయన్ని కొత్తగా చూపించాలంటే వీరభద్ర, లయన్, రూలర్ లాంటి డిజాస్టర్స్ లుక్స్ లో చూపించాలి, గోపీచంద్ మలినేని బాగానే చూపించాడులే అంటూ కొంతమంది ఫాన్స్ కవర్ చేస్తున్నారు. ఏది ఏమైనా NBK 107 ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ సెకండ్ లుక్ కి రాలేదనే చెప్పాలి.

NBK107: Trolls on Balayya Second Look:

A Tribute For NTR On His 100th Birth Anniversary With A Mass Poster Of NBK107
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs