Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్


మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట థియేటర్స్ లో మే 12 న రిలీజ్ అయ్యి అద్భుతమైన టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో హిట్ అవడంతో మహేష్ ఫాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఘట్టమనేని అభిమానులకి మహేష్ సర్కారు వారి పాట హిట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. మరోపక్క కృష్ణ గారి బర్త్ డే రోజున కేక్ కటింగ్స్ మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్స్ వస్తాయి.. ఇలా వరసగా మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ లే గుడ్ న్యూస్ లు. ఇప్పుడు మహేష్ ఫాన్స్ కి మరో స్వీట్ న్యూస్ అంటున్నారు.

Advertisement
CJ Advs

అదేమిటంటే సర్కారు వారి పాట స్ట్రీమింగ్ పార్టనర్ అమెజాన్ ప్రైమ్ అంటూ సినిమా టైటిల్స్ లోనే రివీల్ చేసిన మేకర్స్.. ఇప్పుడు అనుకున్న డేట్ కన్నా ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్నటివరకు ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉండి థియేటర్స్ లో సర్కారు వారి పాట ని మిస్ అయిన ఆడియన్స్ కూడా సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా స‌ర్కారు వారి పాట‌ ఓటీటీ రిలీజ్ డేట్ విష‌యంలో రెండు తేదీలు పెట్టుకున్నారట మేకర్స్. జూన్ 10 లేదా జూన్ 24.. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక‌రోజున స‌ర్కారు వారి పాట‌ ని అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట. మరి పెద్ద సినిమాలు థియేట్రికల్ రన్ ముగిసిన నెల వరకు ఓటిటిలో స్ట్రీమింగ్ లోకి రావు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్యా అమెజాన్ ప్రైమ్ వారు సర్కారు వారి పాట మేకర్స్ తో చర్చించి అనుకున్న తేదీ కన్నా ముందే ఓటిటిలో స్ట్రీమింగ్ చెయ్యడానికి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగైతే నిజంగా మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ అన్నట్టే కదా.

Good news for Mahesh fans:

Sarkaru Vaari Paata Ott streaming date locked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs