Advertisement
Google Ads BL

విరాట పర్వం పై వింత వింత వార్తలు


రానా - సాయి పల్లవి కలయికలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం నిన్నటివరకు విడుదల కష్టాలను ఎదుర్కొంది. ఎప్పుడో విడుదల కావల్సిన విరాట పర్వం మధ్యలో రకరకాల కారణాలతో విడుదల వాయిదా వేసుకుంటూ షూటింగ్ పూర్తయిన ఏడాదిన్నరకి అంటే జులై 1 న విడుదల కి రంగం చేసి రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్, రానా లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నా.. విరాట పర్వం విషయంలో రకరకాల నెగెటివ్ న్యూస్ లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇదిగో ఇప్పుడు జులై 1 న రిలీజ్ అన్నాక కూడా విరాట పర్వం సినిమా నక్సల్స్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కింది.. ఈ సినిమాకి పెద్దగా థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. గతంలో విరాట పర్వం సినిమాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు చూసినా.. తర్వాత తర్వాత ఆయన కూడా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపడంతో రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అటు థియేట్రికల్ బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది, అలాగే ఓటిటి సంస్థలు కూడా విరాట పర్వానికి తక్కువ కొటేషన్స్ కోడ్ చేస్తున్నాయట. అందుకే థియేట్రికల్ బిజినెస్ లాభాలతో జరిగినప్పుడే విరాట పర్వం రిలీజ్ చెయ్యాలని అప్పటివరకు సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

Strange news on Virata Parvam:

Speculation On Virata Parvam movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs