Advertisement
Google Ads BL

డబ్బు ఎలా కొట్టేసారో తెలియదన్న బోని కపూర్


ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఎంత తెలివైన వాళ్ళ నుండి అయినా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అకౌంట్స్ నుండి డబ్బులు కొట్టెయ్యడం, తర్వాత ఎవరికీ తెలియకుండా జంప్ అవడం అనేది రోజూ టివి న్యూస్ లో చాలా చూస్తూనే ఉన్నాం. మన అకౌంట్ నుండి మనకి తెలియకుండానే ఓటీపీ చెప్పించుకుని మరీ డబ్బులు మాయం చేస్తూ హంగామా చేస్తున్నారు. కొందరిని పోలీస్ లు మట్టుబెట్టినా.. కొందరి విషయంలో ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. తాజాగా బాలీవుడ్ లో పెద్ద ప్రొడ్యూసర్ బోని కపూర్ అకౌంట్ నుండి ఆయనకి తెలియకుండానే సైబర్ నేరగాళ్లు లక్షల్లో సొమ్ము కాజెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
CJ Advs

బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్‌ బుధవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌ లని సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ జరిపి 3.82 లక్షలను దోచుకున్నారని, ఆ విషయం బోని కపూర్ కి కూడా తెలియదని, తర్వాత ఎప్పుడో అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పొగొట్టుకున్న విషయం తెలియగానే పోలీస్ లని సంప్రదించారట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Boney Kapoor credit card misused in cyber fraud:

Film producer Boney Kapoor credit card misused, loses Rs 3.82 lakh in cyber fraud
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs