NTR..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుుగ వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. ఆయనకు ఇది శత జయంతి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు.. ప్రపంచంలోని తెలుగువారందరూ ఆయన శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం బింబిసార చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.
బింబిసార పోస్టర్‌ను గమనిస్తే .. అందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా.. మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ శత జయంతి విషెష్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బింబిసారలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.