Advertisement
Google Ads BL

బిందు మాధవికి బిగ్ ఆఫర్స్ నిజమేనా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన బిందు మాధవి కి సినిమా ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయనే న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందు బిగ్ బాస్ విన్నర్స్ విషయంలోనూ ఇదే జరిగింది. అంటే బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్స్ గా బయటికి వచ్చిన వారంతా కెరీర్ లో హీరోలుగా సినిమాలు చేయబోతున్నారని, వాళ్ళకి బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పినా, సీజన్ 5 విన్నర్స్ వరకు ఆఫర్స్ విషయంలో పెద్దగా హడావిడి అయితే కనిపించలేదు. శివబాలాజీ దగ్గరనుండి కౌశల్, రాహుల్ సిప్లిగంజ్,  అభిజిత్, సన్నీ ఇలా ఎవరూ సక్సెస్ అయినట్టుగా కనిపించలేదు. హడావిడి తప్ప. మరి ఈ రేస్ లో ముందు నిలిచిన బిగ్ బాస్ బిందు మాధవి మాత్రం సక్సెస్ అయ్యేలానే కనబడుతుంది.

Advertisement
CJ Advs

అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేలో హడావిడి చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి బిందు మాధవికి ఓ సినిమా ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అది కూడా అయన చెయ్యబోయే బాలకృష్ణ సినిమాలో బిందు మాధవికి మంచి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లో డీసెంట్ గా ఉండి.. టైటిల్ గెలిచి ఇంటికి రాగానే ఆమెకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్లుగా టాక్. కానీ బిందు మాధవి మాత్రం ఈ సమయంలో తొందరపడకుండా కేవలం తనకు సెట్ అయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క బిందు మాధవికి ఒక లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో కూడా ఆఫర్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి నిజంగా ఇవన్నీ నిజమైతే.. కెరీర్ లో ఓ బిగ్ బాస్ విన్నర్ సక్సెస్ అయినట్టే. లేదంటే మిగతా వాళ్ళలా.. రూమర్స్ అయితే బిందు మాధవి కూడా రొటీన్ విన్నర్ లానే మిగిలిపోతుంది.

Bindu Madhavi Likely To Work In Balayya Next:

Bigg Boss Bindu Madhavi In Anil Ravipudi And Balakrishna Movie
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs