ట్రిపుల్ వరల్డ్ వైడ్ గా మార్చ్ 25 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించింది. అదిరిపోయే కలెక్షన్స్ తో అన్ని భాషల్లో హిట్ అయ్యింది. ఇప్పుడు మే 20 న థియేటర్స్ నుండి ఓటిటి ద్వారా ప్రతి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఓటిటి లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ని వీక్షించిన హాలీవుడ్ నటుడు ఒకరు ట్రిపుల్ ఆర్ యూనిట్ ని, రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. మే 20 న జీ 5 ఓటిటితో సౌత్ ప్రేక్షకులని అలరించిన ట్రిపుల్ నెట్ ఫ్లిక్స్ ద్వారా హిందీ ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ ని చూసిన హాలీవుడ్ నటుడు పాటన్ ప్రతి ఒక్కరు ఓటిటి ద్వారా ట్రిపుల్ ఆర్ ని చూడాలంటూ ట్రిపుల్ పై రివ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ట్రిపుల్ ఆర్ నిజంగా ఓ అద్భుతమైన సినిమా. మీరు గనక థియేటర్స్ లో మిస్ అయితే ఇప్పుడు ఓటిటి లలో వచ్చేసింది.. తప్పక చూడండి. రాజమౌళి గారు మీరు గ్రేట్ అండి, మీ థాట్స్, మీరు సినిమాకి తెరకెక్కించిన విధానం, అలాగే కథ చెప్పిన తీరు అన్ని నిజంగా అద్భుతమే. మిమ్మల్ని సినిమాలు చెయ్యనియ్యకూడదు. మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ పొతే మిగతా వాళ్ళు ఏం చెయ్యాలి అన్నట్టుగా చెప్పిన పాటన్ మీ తదుపరి సినిమా కోసం వెయిటింగ్ అంటూ రాజమౌళిని అప్రిశేట్ చెయ్యడమే కాదు, ట్రిపుల్ కి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు ఆయన.