Advertisement
Google Ads BL

విడాకులు తీసుకున్నా కలిసే పార్టీలకి


ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత విడిపోతే.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం సహజం. కానీ కొంతమంది పిల్లల కోసమని అప్పుడప్పుడు కలుస్తుంటారు. అలా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఉంటే.. తమిళనాట రీసెంట్ గా విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య ఉన్నారు. ఇక బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తన భార్య తో ఎప్పుడో విడిపోయినా పిల్లల కోసమని తరచూ కలిసే వెకేషన్స్ కి వెళుతుంటారు. ఇక ఈమధ్యనే విడాకుల స్టేట్మెంట్ తో అందరికి షాకిచ్చిన అమీర్ ఖాన్ - కిరణ్ రావు లు విడాకులు తీసుకున్నాక కూడా లాల్ సింగ్ చెడ్డ సినిమా కోసం కలిసే వర్క్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఆలాగే రీసెంట్ గా కొడుకు ఆజాద్‌ రావు ఖాన్‌ బర్త్ డే ని అమీర్ ఖాన్ - కిరణ్ రావు కలిసే సెలెబ్రేట్ చేసారు. ఇక నిన్న కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి అమీర్ ఖాన్ తన ఎక్స్ వైఫ్ అయిన కిరణ్ రావు కలిసి మెలిసి వచ్చారు. పార్టీలోనూ ఇద్దరూ కలిసే ఫోజులు ఇచ్చారు. అమీర్ ఖాన్ బ్లూ డ్రెస్‌లో రాయల్‌ లుక్‌లో కనిపిస్తే, మాజీ భార్య కిరణ్‌ రావు సిల్వర్‌ డ్రెస్సులో హైలెట్ అయ్యారు. రెడ్‌ కార్పెట్‌పై అమీర్ - కిరణ్ రావు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం ఇవ్వడం చూసిన వారు విడాకులు తీసుకున్నా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు వీళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Aamir Khan, Kiran Rao attend Karan Johar bash together:

Aamir Khan, Kiran Rao attend Karan Johar Birthday Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs