Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ ఊరుకుంటారా?


పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణు దేశాయ్ తో తన పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. అకీరా, ఆద్య ల కోసం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇంటికి వెళుతుంటారు. వారి బర్త్ డే పార్టీలు, అలాగే వాళ్ళ స్కూల్ ఫంక్షన్స్ కి పవన్ అటెండ్ అవుతారు. భార్య రేణు దేశాయ్ తో విడిపోయినా పిల్లలని మాత్రం పవన్ వదల్లేదు. రేణు దేశాయ్ దగ్గరే పెరిగే అకీరా, ఆద్యలకు మెగా ఫ్యామిలితోను మంచి అనుబంధమే ఉంది. అప్పుడప్పుడు వారు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపిస్తారు. పవన్ వారసుడిగా, మెగా హీరోగా అకీరా ఎంట్రీ కోసం మెగా, పవన్ ఇద్దరి ఫాన్స్ వెయిటింగ్.

Advertisement
CJ Advs

రీసెంట్ గా అకీరా గ్రాడ్యువేషన్ డే కి పవన్ కళ్యాణ్ కూడా హాజరైన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అక్కడ అకీరా నందన్ RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించి అందరినీ ఆకర్షించాడు. అదే టైం లో అకీరా ఇంటి పేరు అకీరా నందన్ కొణిదెల బదులు, అకీరా నందన్ దేశాయ్ అని స్క్రీన్ మీద రావడంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తన తండ్రి ఇంటి పేరు కన్నా, తల్లి ఇంటి పేరు మీదే హైలెట్ అవడానికి ఇష్టపడుతున్నాడంటూ వార్తలొచ్చేశాయి. మరి నిజంగానే అకీరా మెగా వారసుడిగా అంటే కొణిదెల వారసుడిగా కాకుండా రేణు దేశాయ్ వారసుడిగా ఉంటే పవన్ ఫాన్స్ ఒప్పుకుంటారా? పవన్ విషయంలో పవన్ ఫాన్స్ రేణు దేశాయ్ ని ట్రోల్ చెయ్యడానికి కూడా వెనుకాడరు. అలాంటిది అకీరా కొణిదెల కాకుండా, అకీరా దేశాయ్ అంటే ఫాన్స్ ఒప్పుకోరేమో..

Akira Drops Pawan Kalyan Surname?:

All not well between Pawan Kalyan and his son?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs