Advertisement
Google Ads BL

మీడియాలో ప్రశాంత్ నీల్-సైలెంట్ గా యశ్


కెజిఎఫ్2 తో సంచలనాలకు నెలవుగా మారిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ - హీరో యశ్ లో నిన్నమొన్నటివరకు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కెజిఎఫ్ 2 అన్ని భాషల్లోనూ భారీ హిట్ కొట్టడంతో.. వీరిద్దరూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యారు. అయితే కెజిఎఫ్2 రిలీజ్ అయ్యి 40 డేస్ పూర్తవుతుంది. కెజిఎఫ్ 2 హవా ముగియగముందే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్, NTR31 తో మీడియాలో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. సలార్ రెస్యూమ్ షూట్, అలాగే NTR31 లుక్ తో ప్రశాంత్ నీల్ స్టిల్ ఇప్పటికి మీడియాలోనే ఉన్నారు.

Advertisement
CJ Advs

కెజిఎఫ్ హవా ముగిసాక హీరో యశ్ మాత్రం వార్తల్లో లేరు. ఆయన కెజిఎఫ్ 2 తర్వాత ఏ సినిమా చేస్తారు. ఏ జోనర్ ఎంచుకుంటున్నారు. తదుపరి దర్శకుడు ఎవరు, యశ్ మళ్ళీ పాన్ ఇండియా ఫిలిం చేస్తారా.. లేదంటే కన్నడ కు సరిపోయే కథతో వస్తారా.. అసలు యశ్ తదుపరి ఫిలిం పై ఎలాంటి అప్ డేట్ వినిపించడం, కనిపించడం లేదు. అలాగే మీడియాలోనూ యశ్ ఊసు లేదు. కెజిఎఫ్ 2 హిట్ తర్వాత ఫ్యామిలీతో గోవా ట్రిప్ కి వెళ్ళిన యశ్ ఒకటిరెండు సార్లు పిల్లలతో మీడియా కి ఫోకస్ అయినా ప్రెజెంట్ మాత్రం కామ్ గా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ ని వాడుకుంటుంటే.. కన్నడలో మూలపడివున్న పాత సినిమాలను దుమ్ముదులిపి డబ్ చేసి లక్కీ స్టార్ యశ్ ను క్యాష్ చేసుకుంటుంటే.. యశ్ ఇలా కామ్ గా ఉండడం ఆయన ఫాన్స్ కి నచ్చడం లేదు.

Difference between Prashant Neel and Yash:

Prashant Neel powering on, Yash sliding down?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs