బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సాంగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ముగించుకుని టీం అమెరికాకి పయనం కానుంది. అమెరికా లో ఓ 20 రోజుల పాటు కీలక నటులతో సినిమాలో హైలెట్ అయ్యే సన్నివేశాల చిత్రీకరణ గోపీచంద్ మలినేని చేపట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా జాయిన్ కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చెయ్యబోతున్నారు. F3 ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి బాలయ్య సినిమాపై అందరిలో క్యూరియాసిటీ పెంచేలా అప్ డేట్స్ ఇస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ నడి వయస్కుడు అంటే.. తండ్రి పాత్రలో పవర్ ఫుల్ గా కనిపిస్తారని, ఆయనకి కూతురుగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది.. ఈ కథ మొత్తం తండ్రి-కూతురు మధ్యన నడిచే కథ అంటూ అనిల్ NBK108 విషయాలను రివీల్ చేసారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళుతుంది అని.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది అని, బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా వుంటుంది అని, అలాగే ఫన్ వుంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం.. అంటూ అనిల్ రావిపూడి రీసెంట్ F3 ఇంటర్వ్యూలో చెప్పడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.