అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ లా ప్రొజెక్ట్ అయిన అఖిల్.. మొదటిసారి ఫుల్ మేకోవర్ తో మాస్ మూవీ చేస్తున్నాడు. ఏజెంట్ మూవీ కొత్త షెడ్యూల్ రీసెంట్ గానే మనాలిలో మొదలయ్యింది. అఖిల్ ఈ మధ్యనే మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్లి అక్కడ బీచ్ అందాలతో పాటుగా స్విమ్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవాడు.
ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ లో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైదే నటిస్తుంది. అయితే ఏజెంట్ మూవీ ఆగస్టు లో రిలీజ్ కి రెడీ అవుతుంటే.. ఈ సినిమా ఓటిటి రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ కి దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈమధ్యన కెజిఎఫ్, సర్కారు వారి పాట లాంటి భారీ చిత్రాలను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ అక్కినేని ప్రిన్స్ ఏజెంట్ మూవీని కూడా కొనేసింది అనే టాక్ నడుస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో చిత్రీకరించిన అఖిల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అఖిల్ యాక్షన్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.