పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ కలయికలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ ఇప్పటికే 25 నుండి 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ తో ఆగిన సలార్ షూటింగ్.. మళ్ళీ ఇన్నాళ్ళకి హైదరాబాద్ లోకి రామోజీ ఫిలిం సిటీలో షూట్ రెస్యూమ్ అంటూ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే నెల మొదటి వారంలో టీజర్ చెయ్యాలని టీం అనుకుంటుంది. దానితో ఫాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు.
అయితే సలార్ షూటింగ్ మొదలైనప్పటినుండి టీం కి లీకులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అప్పట్లో ప్రభాస్ బైక్ పై ఉన్న లుక్, అలాగే యాక్షన్స్ సన్నివేశాల్లో ప్రభాస్ పాల్గొంటున్న పిక్స్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఈరోజే మొదలైన సలార్ షూటింగ్ సెట్స్ నుండి మళ్లీ సలార్ పిక్స్ లీక్ అవడంతో సలార్ యూనిట్ తలపట్టుకుంది. సలార్ సెట్‌లో అడుగు పెట్టిన ప్రభాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలా ప్రభాస్ ఫోటోలు లీకవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్న ఫొటో, కుర్చీలో కూర్చున్న ఫొటో, సెట్ కు సంబంధించిన ఒక ఫొటో, ఆ ఫొటోస్ లో ప్రభాస్ చేతినిండా మసి పూసుకుని మాసివ్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. మొదటి రోజే సెట్స్ నుండి మూడు పిక్స్ లీకవడంతో సలార్ టీం కంగారు పడుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ ఫొటోలను ఎవరో షూట్ చేసి, లీక్ చేశారు అంటున్నారు.