రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ లైట్ తీసుకున్నా బాలీవుడ్ మాత్రం పలు ప్రాజెక్ట్స్ తో ఆదరించింది. ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ రన్ వే 24, జాన్ అబ్రహం తో కలిసి నటించిన అటాక్ మూవీలో నటించింది. ఆ రెండు చిత్రాలు కూడా నిరాశ పరిచినా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ తన ప్రేమ విషయంపై, వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ మంచి ఫ్రెండ్ అని, అలాగే ఇద్దరి అభిరుచులు ఒక్కటే అని, అందుకే ఇద్దరం ప్రేమలో పడ్డామని, తాము రిలేషన్ లోకి వెళ్ళినప్పుడే తమ గురించిన విషయాలను ప్రపంచానికి వీలైనంత తొందరగా.. ఎక్కువగా తెలియాలి అనుకున్నామని, లేదంటే రకరకాల అసత్య ప్రచారాలతో మనసు పాడు చేసుకుని ప్రశాంతతని కోల్పోవాల్సి వస్తుంది అందుకే తమ రిలేషన్ ని అంత త్వరగా బయటపెట్టామని చెబుతుంది.
నిజానికి మా పర్సనల్ లైఫ్ గురించి కాదు, మేము చేసే పని గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎవ్వరైనా ఓ రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా సహజం. మన లైఫ్‌లో తల్లితండ్రులు, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. కాకపోతే సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము ముందుగానే అందరికి మా ప్రేమ విషయం చెప్పేశాం అంటూ చెప్పుకొచ్చింది రకుల్. నిజగానే రకుల్ ప్రీత్ చెప్పింది అక్షరాలా సత్యమే.. వారు ప్రేమ విషయం చెప్పకపోతే రకుల్ పై రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి.