Advertisement
Google Ads BL

Chiru154 టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు


మెగాస్టార్ చిరు ఆచార్య రిలీజ్ తర్వాత భార్య సురేఖతో కలిసి అమెరికా ట్రిప్ లో ఉన్నారు. తరవాత చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ షూటింగ్స్ లో పాల్గొంటారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ ని మల్టిస్టారర్ గా మార్చేసిన చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ లో కీర్తి సురేష్ కి అన్నగా నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలు రీమేక్ లు. ఇక తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ Chiru154 లో నటించనున్నారు. ఈ స్క్రిప్ట్ ఒరిజినల్. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చిరు లుక్ పై అంచనాలు పెంచేశారు కూడా.
అయితే ఈ సినిమాకి టైటిల్ గా వాల్తేర్ వీరయ్య అంటూ ఆచార్య ప్రమోషన్స్ లో చిరు రివీల్ చేసారు. ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న ఈ టైటిల్ ని చిరంజీవి అధికారికంగా ప్రకటించక ముందే రివీల్ చేసేసారు. ఆతర్వాత కూడా అధికారికంగా ఆ టైటిల్ పై ఎలాంటి ప్రకటన లేదు. ఇక రీసెంట్ గా దర్శకుడు బాబీ కూడా Chiru154 టైటిల్ వాల్తేర్ వీరయ్య అని కన్ ఫర్మ్ చేసారు. తాజాగా విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో.. దర్శకుడు బాబీ చిరుతో తాను చేస్తోన్న చిత్రానికి వాల్తేర్ వీరయ్య టైటిల్‌ని ఫిక్స్ చేశామని క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

Chiru154 movie Title:

Chiru154 is the director who revealed the title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs