కొరటాల శివ - ఎన్టీఆర్ మూవీ పై నిన్నమొన్నటివరకు భారీ అంచనాలు ఉన్నపప్టికి.. ఆచార్య మూవీ ప్లాప్ తర్వాత కొరటాలపై ఎన్టీఆర్ ఫాన్స్ లో చిన్నపాటి అనుమానం మొదలైనా.. ఎన్టీఆర్ బిర్ట్గ్ డే రోజున ఇచ్చిన వీడియో తో ఫాన్స్ లో ఉన్న అనుమానాలు ఎగిరిపోయాయి. అంటే ఆచార్య తో కొరటాల చాలా డిస్పాయింట్ చేసారు.. వెంటనే NTR30 అంటే ఫాన్స్ భయపడ్డారు. కానీ మాస్ యాక్షన్ తో ఎన్టీఆర్ ని కొరటాల కొత్తగా చూపించడానికి రెడీ అవుతున్నారు. కొరటాల కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిన మిర్చి సినిమాకి మించిన యాక్షన్ తో, బలమైన కథతో కొరటాల శివ NTR30 చెయ్యబోతున్నారు అని స్పష్టత కూడా ఇచ్చారు.
అయితే కొరటాల ఎన్టీఆర్ లుక్ ని డిఫ్రెంట్ గా మాస్ గా అంటే చాలా రఫ్ గా డిజైన్ చేసారని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ - కొరటాల కలయిక మూవీ కోసం ఎన్టీఆర్ ఫోటో షూట్ చేసారని, అలాగే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నారని, కొరటాల మూవీ లుక్ కోసం ఎన్టీఆర్ వెయిట్ కూడా తగ్గుతున్నారని.. జూన్ రెండు నుండి కొరటాల - ఎన్టీఆర్ కాంబో మూవీ పూజ కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.