Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ డైరెక్టర్ ఏమైపోయాడు


భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్, రానా బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ కి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించారు. ఈ సినిమాని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ సాగరే.. కానీ మరో దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ అక్కడ భీమ్లా నాయక్ విషయం లో హైలెట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని సాగర్ తెరకెక్కించాడో లేదంటే త్రివిక్రమ్ తెరకెక్కించారో ఎవరికి అర్ధం కానంతగా తివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ లో కనిపించరు. ఇక ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చేస్తుంటే రానా నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. మరోపక్క త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు తో చెయ్యాల్సిన SSMB28 పై ఫోకస్ పెట్టారు.
కానీ భీమ్లా డైరెక్టర్ సాగర్ కె చంద్ర విషయమే తేలడం లేదు. ఆయన తన తదుపరి మూవీని ఏ హీరో చేస్తున్నారో.. ఏ హీరోకి కథ చెప్పడానికి ట్రై చేస్తున్నారో అన్న విషయమే క్లారిటీ రావడం లేదు. భీమ్లా నాయక్ హిట్ తర్వాత సాగర్ కె చంద్ర మళ్ళీ మీడియాలో ఫోకస్ అయిన సందర్భం లేదు. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో హిట్ కొట్టాక ఆ దర్శకుడి రేంజ్ ఎలా ఉండాలి.. స్టార్ హీరోలు పిలిపించి కథ చెప్పించుకోవాలి. కానీ సాగర్ కె చంద్ర విషయంలో అలా జరగడంలేదు, జరిగేలా లేదు.

Advertisement
CJ Advs

What happened to the director of Bheemla Nayak:

Bheemla Nayak Director Sagar k chandra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs