Advertisement
Google Ads BL

కశ్మీర్ షెడ్యూల్ ముగించేసిన విజయ్-సమంత


శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న లవ్ స్టోరీ ఖుషి. ఈ మధ్యనే కశ్మీర్ లో ఖుషి మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుంది. ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. సమంత బర్త్ డే ని ఖుషి సెట్స్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన ఖుషి టీం.. విజయ్ దేవరకొండ బర్త్ డే ని అంతే గ్రాండ్ గా నిర్వహించింది. కశ్మీర్ లో విజయ్ దేవరకొండ - సమంత పై బ్యూటిఫుల్ లవ్ సన్నివేశాలని శివ నిర్వాణ తెరక్కించారు. మంచు కొండల మధ్యన ఖుషి షూటింగ్ నిజంగానే ఖుషి ఖుషీగా సాగినట్టుగా వర్కింగ్ స్టిల్స్ తో చూపించారు. అయితే తాజాగా కశ్మీర్ లో భారీ షెడ్యూల్ ని ముగించేసింది టీం. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

కశ్మీర్ షెడ్యూల్ ముగించేసిన విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది.. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో త్వరలోనే, ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.. అంటూ లొకేషన్స్ లో టీం మొత్తం పార్టీ చేసుకుంటున్న పిక్ తో అప్ డేట్ ఇచ్చింది టీం. విజయ్ దేవరకొండ కూడా ఖుషి ప్యూర్ లవ్ స్టోరీ అంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ సినిమాలో సమంత కాశ్మీరీ గర్ల్ గా కనిపించనుంది. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటుగా పూరి జగన్నాధ్ తో కలిసి జన గణ మన మూవీ కూడా చెయ్యబోతున్నారు. అటు సమంత కూడా యశోద, హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా వుంది.

Vijay Deverakonda-Samantha finishing Kashmir schedule:

Kushi has wrapped up a wondeful first schedule 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs