ప్రభాస్ ఫాన్స్ కి తిక్కరేగింది. అందుకే ప్రభాస్ సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి, దర్శకులకి సోషల్ మీడియా లో సెగ చూపిస్తున్నారు. గతంలో రాధే శ్యామ్ ప్రొడ్యూసర్స్ యువి క్రియేషన్స్ వారిని రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో యువి క్రియేషన్స్ పై నెగెటివిటి ట్వీట్స్ తో ట్రెండ్ చేస్తూ హంగామా చేసారు. తర్వాత సలార్ అప్ డేట్ కోసం అలానే చేస్తూ వస్తున్న ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు ఆదిపురుష్ అప్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ #WakeUpTeamAdiPurush హాష్ టాగ్ ని ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె ఓ షెడ్యూల్ ముగించి రేపు 24 నుండి సలార్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్నారు. ఆ సినిమా లో 30 శాతం చిత్రీకరణ, మిగతా అంతా గ్రాఫిక్ వర్క్స్ ఉండడంతో ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ షూట్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఆదిపురుష్ మొదలైంది, షూటింగ్ ఫినిష్ అయ్యింది. శ్రీరామ నవమికి అప్ డేట్ అనుకుంటే ఫ్యాన్ మేడ్ వీడియో తో సరిపెట్టింది ఆదిపురుష్ టీం. ఇక ఇప్పుడు ఆదిపురుష్ అప్ డేట్ ఇవ్వకుండా ఫాన్స్ ని వెయిట్ చేయిస్తూ ఉన్నారు. ఆగష్టు లో మూవీ రిలీజ్ అనుకుంటే అది కాస్తా.. జనవరికి వెళ్ళింది. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ అయినా ఇస్తే బావుంటుంది అంటూ ప్రభాస్ ఫాన్స్ నిద్ర లెగండి ఆదిపురుష్ టీం అంటూ #WakeUpTeamAdiPurush హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ మొదలు పెట్టారు.