Advertisement
Google Ads BL

విశాల్ లాఠీ రిలీజ్ డేట్ ఫిక్స్


యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లాఠీ. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా లాఠీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 12న  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్నా నవ్వుతూ కనిపించడం విశాల్ పాత్రలోని హై ఇంటెసిటీని తెలియజేస్తుంది.

సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్‌ ఆ లాఠీ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ని దర్శకుడు వినోద్‌ కుమార్‌ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.

Pan India Film Laatti Releasing Worldwide On:

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Releasing Worldwide On August 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs