Advertisement
Google Ads BL

NTR31 లుక్ పై సిల్లీ మీమ్స్


నిన్న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ తో మూవీ కమిట్ అయిన ప్రశాంత్ నీల్ NTR31 అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ వదిలి ఫాన్స్ ని పిచ్చెక్కించారు. ప్రశాంత్ నీల్ ఎప్పటిలాగానే మాస్ యాక్షన్ టైప్ లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ డిజైన్ చేసి రివీల్ చెయ్యగా.. ఎన్టీఆర్ ని అంత మాస్ అవతార్ లో చూసి ఫాన్స్ కి కిక్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ NTR30 లో చాలా కొత్తగా, మాసివ్ లుక్ లో చిన్నపాటి గెడ్డంతో ఉగ్ర రూపంలో కనిపించి సర్ ప్రైజ్ చేసారు. ఎన్టీఆర్ లుక్ పరంగా వంక పెట్టాడని లేదు. కానీ ప్రశాంత్ నీల్ సైడ్ నుండే ఎన్టీఆర్ లుక్ పై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

అది ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం యాక్షన్ మూవీ, తర్వాత కెజిఫ్ రెండు పార్టులు యాక్షన్ ప్యాకెడ్ మూవీస్. అందులో యశ్ ని హీరోలా కాకుండా విలన్ గా ప్రొజెక్ట్ చేసి లుక్ వైజ్ గా మాస్ గా చూపించడమే కాదు, యశ్ ని కెజిఫ్ గనుల్లో మురికిగా నల్లగా చూపించారు. ఇక తదుపరి మూవీ సలార్ లో ప్రభాస్ ని బొగ్గు గనుల్లో చూపిస్తూ మొహానికి మసి రాసారు. అక్కడా ప్రభాస్ మాసివ్ లుక్, చిన్న గెడ్డం, చేతిలో మారణాయుధాలు. ఇక తాజాగా ఎన్టీఆర్ లుక్ కూడా ప్రశాంత్ నీల్ వెర్షన్ లో రొటీన్ గా ఊర మాస్ లుక్, మళ్ళీ మొహం నలుపు రంగు..ఈసారి ఎన్టీఆర్ కి ఎలాంటి మసి పూస్తారు. ఎలాంటి మైన్స్ లో ఎన్టీఆర్ విలనిజాన్ని హైలెట్ చేస్తావ్ మావ.. ప్రశాంత్ మావ.. నీ స్టయిల్ మారదా? నువ్వు యాక్షన్ తప్ప కొత్తగా ట్రై చెయ్యవా? అది కూడా మొహానికి మసి పుయ్యడం తప్ప వేరేది తెలియదా? అంటూ కెజిఫ్, సలార్, NTR30 లుక్స్ కలిపి వైరల్ చేస్తున్నారు.

Silly memes on the NTR31 look:

Memes on Prashanth Neel First Look Posters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs