Advertisement
Google Ads BL

కాన్స్‌ ఫెస్టివల్: షాకింగ్ కామెంట్స్ చేసిన పూజ


గత రెండు మూడు రోజులుగా ఫ్రాన్స్ లో కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్, సౌత్ తారలు మెరిసిపోతూ అందమైన డిజైనర్ వెర్ డ్రెస్సులతో అందరి వంతులు పోగొడుతున్నారు. ఐశ్వర్య రాయ్ దగ్గరనుండి.. పూజ హెగ్డే, నయనతార, దీపికా, తమన్నా ఇలా హీరోయిన్స్ అంతా అందంగా మెరిసిపోయారు. ఫెదర్స్‌ గౌన్‌లో బుట్టబొమ్మలా మెస్మరైజ్ చేసిన బ్యూటీ పూజ హెగ్డే కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై వాక్ చేసి, ఆ ఫంక్షన్ లో పాల్గొన్న తర్వాత తన అనుభూతిని గుర్తు చేసుకొంటూ.. నా జీవితంలో అద్భుతమైన రోజు అంటూ పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత పూజ హెగ్డే తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. 

Advertisement
CJ Advs

మొదటిసారి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందడంతో చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. కాన్స్ ఫెస్టివల్ రెడ్‌ కార్పెట్‌పై మెరిసేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌ వేర్‌ దుస్తులను నా టీం సిద్ధం చేసింది. చాలా కష్టపడి నా టీం అన్నిటిని రెడీ చేసింది. ఇండియా నుండి ఫ్రాన్స్‌ వచ్చాక నా బ్యూటీ ప్రోడక్ట్స్, డిజైనర్ డ్రెస్సుల బ్యాగులు కనిపించకుండా పోయాయి. అవన్నీ ఇండియా ఎయిర్‌పోర్టులోనే మిస్ అయ్యాయి. ఎయిర్‌పోర్టులో నా బ్యాగ్స్‌ చెకిన్‌ అయ్యాయి. కానీ అందులో నా మేకప్ ప్రొడక్ట్స్, డ్రెస్సులకి సంబంధించిన బ్యాగ్స్‌ మాత్రం కనిపించలేదు. తీరా ఫ్రాన్స్‌లో ల్యాండ్‌ అయ్యాకే అసలు విషయం తెలిసింది. దీంతో నేను, నా టీం కంగారు పడిపోయాము. రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసేందుకు అవసరమైన దుస్తులు లేకపోయేసరికి అందరిలో ఆందోళన మొదలైంది. 

దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో​ ఇండియాలో కొన్న బంగారు నగలు నా హ్యాండ్‌ బ్యాగులో ఉన్నాయి. దానితో ఊపిరి పీల్చుకున్నాను. ఫంక్షన్ కి కొద్దిగా టైం ఉండడంతో నేను వెంటనే మా టీం తో బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్ కొనమని చెప్పాను. వాళ్ళు అన్ని చక చకా సిద్ధం చేసారు. ఆ రోజంతా నాతో పాటు ఎవరూ కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయలేదు. రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నాం.. అంటూ పూజ హెగ్డే తనకి ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

Pooja Hegde Says She Lost All Her Clothes Before Cannes 2022:

Pooja Says She Lost All Her Clothes Before Cannes 2022 Red Carpet Debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs