Advertisement
Google Ads BL

NTR31: ఊర మాస్ గా యంగ్ టైగర్


కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటేనే ఊర మాస్. హీరోలని మాస్ గా ఎలివేట్ చేస్తూ వాళ్ళ ఫాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చే ప్రశాంత్ నీల్ యశ్ ని కెజిఎఫ్ 2 లో ప్రపంచమే మెచ్చేలా రాఖి భాయ్ లా చూపించారు. ఇక సలార్ లోను ప్రభాస్ ని కెజిఎఫ్ లో యశ్ కి మించి చూపించబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే డిజైన్ చేసి ప్రభాస్ ఫాన్స్ ని ఉర్రుతలూగించారు. ఇక ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కలయికలో NTR31 మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా NTR31 నుండి ఓ స్పెషల్ ట్రీట్ రాబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగానే ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫాన్స్ కి పవర్ ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

NTR31 నుండి ఎన్టీఆర్ మాసివ్ పవర్ ఫుల్ లుక్ ని 𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅! 𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥,𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝. అంటూ రిలీజ్ చెయ్యగా.. మాస్ కాదు ఊరమాస్ అమ్మో ఎన్టీఆర్ ని చూస్తుంటే కెజిఎఫ్2 లో యశ్ కి సలార్ లో ప్రభాస్ లుక్స్ కి మించి భయనాంకంగా కనిపిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ మాసివ్ లుక్ చూస్తే నిజంగా సర్ ప్రైజింగ్ గా ఉంది. ఎన్టీఆర్ ఫియర్స్ లుక్ లో వన్ సైడ్ ఫేస్ ని చూపిస్తూ NTR31 టైటిల్ లో TR(తారక రామారావు) ని హైలెట్ చేస్తూ లుక్ రిలీజ్ చేసారు. ఈ లుక్ కోసం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో స్పెషల్ షూట్ చేయించి ఈ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

NTR Birthday Special: NTR31 first look revealed :

Prashanth Neel - NTR combo NTR31 look revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs