Advertisement
Google Ads BL

KGF పాన్ ఇండియా మూవీ అంటే నవ్వొస్తుంది


పాన్ ఇండియా పదం పలకడానికి ఫన్నీగా ఉంది అంటూ హీరో సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ గానే కాదు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సిద్దార్థ్ KGF చాప్టర్2 పాన్ ఇండియా మూవీ అంటే ఫన్నీగా అనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. పాన్ ఇండియా పదమే వినడానికి ఫన్నీగా ఉంది అని, నేను 15 ఇయర్స్ నుండి చాలా భాషల్లో సినిమాలు చేస్తున్నాను. నేను ఏ భాషలో నటించినా నా డబ్బింగ్ నేనే చెప్పుకునేవాడిని. తమిళంలో నటిస్తే తమిళవాడిలా, తెలుగులో నటిస్తే తెలుగు వాడిలా, అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్ కూడా అంతే. నేను వాటిని ఇండియన్ మూవీస్ అని పిలవాడనికే ఇష్టపడతాను. కానీ పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీస్ లో అత్యధిక ప్రాధాన్యత ఉన్న హిందీ నుండి సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా సూపర్ హిట్ అయితే దానిని హిందీ సినిమానే అంటారు. కానీ ప్రాంతీయ భాషా చిత్రాల విషయంలో అలా ఉండదు. ప్రాంతీయ భాషలో తెరకెక్కి రిలీజ్ అయ్యి హిట్ అయితే వాటిని పాన్ ఇండియా మూవీస్ అంటారెందుకు, ఇండియా మూవీ అనొచ్చు కాదా. కన్నడ నుండి రిలీజ్ అయిన కెజిఎఫ్2 ని పాన్ ఇండియా మూవీ అనడం ఎందుకు, కన్నడ కెజిఎఫ్ జర్నీ అనొచ్చు కాదా.. లేదా ఆ సినిమా క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ ఫిలిం అని పిలవచ్చు. 

అసలు పాన్ ఇండియా మూవీ అంటే నాకు అర్ధం కావడం లేదు. పాన్ ఇండియా మూవీ అనేకన్నా ఇండియన్ మూవీ అనొచ్చు. పాన్ ఇండియా మాటే ఫన్నీగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు సిద్దార్థ్.

Pan India is funny .. Hero Siddharth sensational comments:

Hero Siddharth Sensational Comments On Pan India Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs