Advertisement
Google Ads BL

NTR30: ఫాన్స్ కి పూనకాలే


యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు రేపు మే 20. ఆయన పుట్టిన రోజు కోసం ఎన్టీఆర్ ఫాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఆయన కొత్త సినిమాల అప్ డేట్ వస్తాయని వారి ఆశ. కరోనా పాండమిక్ తో రెండేళ్లుగా ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలని ఎన్టీఆర్ ఫాన్స్ జరుపుకోవడం లేదు. గత ఏడాది లాక్ డౌన్. అంతకుముందు ఏడాది కరోనా లాక్ డౌన్ తో ఇళ్లలో నుండి బయటికి వచ్చి ఎన్టీఆర్ పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకోలేకపోయారు. సో ఈ బర్త్ డే ఎన్టీఆర్ కి స్పెషల్ కాదు, ఆయన ఫాన్స్ కి వెరీ వెరీ స్పెషల్. ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో NTR30 పాన్ ఇండియా ఫిలిం చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందే NTR30 నుండి స్పెషల్ వీడియో రివీల్ చేసి ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు కొరటాల.

Advertisement
CJ Advs

తాను తీసిన మిర్చికి మించి యాక్షన్ NTR30 లో ఉంటుంది అని, బలమైన కథ కాబట్టే పాన్ ఇండియాకి వెళుతున్నామంటూ అంచనాలకు తెర లేపిన కొరటాల శివ.. NTR30 లో అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తనుండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి, తాను రావాల్సిన సమయం వచ్చింది అని.. వస్తున్నా... అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో కూడిన వీడియో ని ఫాన్స్ కి ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వీడియో లో ఈ సినిమాకి వర్క్ చేస్తున్న వారి పేర్లని రివిల్ చేసారు. కొరటాల శివ, ఎన్టీఆర్ టైటిల్స్ పై ఎరుపు రంగుతో కొత్తగా చూపించగా, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్, కళ్యాణ్ రామ్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ ఆర్ట్ డిపార్మెంట్, సినిమాటోగ్రఫీ రత్నవేలు వర్క్ చేస్తున్నట్టుగా ఈ స్పెషల్ వీడియో లో రివిల్ చేసారు. ఇలా చూస్తున్న NTR ఫాన్స్ కి పూనకాలే వస్తున్నాయి.

NTR30 update here:

NTR Birthday Special: NTR30 special video revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs