Advertisement
Google Ads BL

బాబా ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు


బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లాస్ట్ వీక్ లోకి ఎంటర్ అవడంతో హౌస్ లో ఉన్నవారి ఏడుగురి జర్నీలని బిగ్ బాస్ వాళ్ళకి చూపిస్తున్నాడు. యాంకర్ శివ మొదలుకుని అనిల్, అరియనా నిన్నటి బాబా భాస్కర్ వరకు వాళ్ళ జర్నీ అంతా ఎమోషనల్ గా, ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అరియనా అయితే కళ్ళ నీళ్లు పెట్టేసుకుంది. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ ఎనిమిదో వారంలో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. బాబా భాస్కర్ ని ఆ వీడియో లో బాగా ఎలివేట్ చేసాడు బిగ్ బాస్. 

Advertisement
CJ Advs

దాదాపు అరగంట పాటు బాబా భాస్కర్ జర్నీ చూపించారు. హౌస్ లో ఉన్నది నాలుగు వారాలే అయినా.. ఫస్ట్ వీక్ నుండి బాబా భాస్కర్ హౌస్ లో కామెడీ చేసినట్టుగా చూపించారు. తన జర్నీ వీడియో చూసిన తర్వాత బాబా భాస్కర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో చూసాక నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఇంత బాగా చూపిస్తారని అనుకోలేదు. ఈ వీడియో వేరే లెవెల్. ఇది మూడు వారాల ఫుటేజ్‌లా లేదు. నేను ఫస్ట్ వీక్ ఎంటర్ అయినట్టుగా 87 రోజులు ఇంట్లో ఉన్నట్లే ఉంది. నా లైఫ్‌లో ఈ బిగ్ బాస్ వీడియో చాలు. ఈ బిగ్ బాస్ టైటిల్ వద్దు, డబ్బు వద్దు, ఇప్పుడు గేట్ ఓపెన్ చేసినా వెళ్లిపోతా అంటూ బాబా భాస్కర్ ఎమోషనల్ గా కామెంట్స్ చేశాడు.

Bigg Boss non Stop: Baba Bhaskar Emotional journey:

Bigg Boss Telugu OTT: Bigg Boss hails Baba Bhaskar for rewriting history
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs