Advertisement
Google Ads BL

ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని వెడ్డింగ్ పిక్స్


ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని పెళ్లి నిన్న రాత్రి చెన్నై లోని ఓ హోటల్ లో అంగరంగ వైభవంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన జరిగింది. ఆది పినిశెట్టి పెళ్ళికి పెద్దగా సెలబ్రిటీస్ కానీ, ఎక్కువగా సన్నిహితులు కానీ హాజరు కాలేదు. తమ పెళ్లి కి పెద్దగా ఎవరిని పిలవడం లేదు అని, చాలా సింపుల్ గానే పెళ్లి చేసుకుంటున్నాం అంటూ మీడియా ముఖంగా చెప్పారు. ఇక మే 17న సంగీత్, మెహిందీ వేడుకలకి టాలీవుడ్ నుండి నాని, సందీప్ కిషన్, నీరజ కోన హాజరై సంగీత్ వేడుకల్లో డాన్స్ చేస్తూ సందడి చేసారు.

Advertisement
CJ Advs

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని పెళ్లిలో కూడా నాని, సందీప్ కిషన్ లు సందడి చేసారు. అయితే ఆది - నిక్కీ పెళ్లి రాత్రే జరిగినా వారి పెళ్లి ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా లీకవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని పెళ్లి పీటలపై ఉన్న ఫొటోస్ ని షేర్ చెయ్యగానే అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని లు పెళ్లి కొడుకు-పెళ్లి కూతురు గెటప్ లో చాలా అందంగా ఉన్నారు. గోల్డ్ కలర్ సారీ లో నిక్కీ, గోల్డ్ కలర్ పెళ్లి డ్రెస్ లో ఆది పినిశెట్టి లు కలర్ ఫుల్ గా వున్నారు. తలనిండా తలంబ్రాలతో ముచ్చటగా కనిపిస్తుంది ఈ జంట. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని పెళ్లి ఫొటోస్ మీ కోసం..

Aadhi Pinisetty - Nikki Galrani wedding pics out:

Aadhi Pinisetty and Nikki Galrani Wedding: Newlyweds twin in gold attires as they get hitched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs