Advertisement
Google Ads BL

మరోసారి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా జైలుకి?


గత ఏడాది బాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన కేసుల్లో ముఖ్యంగా బాలీవుడ్ సెలెబ్రిటీ అయిన శిల్పా శెట్టి భర్త బ్ల్యూ ఫిలిమ్స్ కేసులో జైలు కి వెళ్లి కొద్ది రోజుల తర్వాత బెయిల్ పై బయటికి రావడం సంచలనం సృష్టించింది. హాట్‌స్పాట్ యాప్ కోసం పోర్న్ మూవీస్, వీడియోలు రూపొందించి.. వాటిని ఆన్ లైన్ లో పెట్టి కోట్లకి కోట్లు డబ్బు సంపాదించిన కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. వియాన్ ఇండస్ట్రీ ద్వారా 13 బ్యాంక్ అకౌంట్ల నుుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి అనే విషయం బయటపడింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కి ఉన్న జాయింట్ అకౌంట్ ద్వారా కోట్లాది రూపాయల ట్రాన్సిక్షన్స్ జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. 

Advertisement
CJ Advs

కుంద్రాతో పనిచేసే పార్టనర్స్ బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే ముంబై పోలీస్ లు సీజ్ చేశారు. ఇక రాజ్ కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియా లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పి ఆ సంస్థ నుంచి హాట్ షాట్స్ అనే యాప్‌ను రూపొందించారు. ఆ హాట్ షాట్స్ యాప్‌ను యూకేలోని కెన్రీన్ అనే సంస్థకు అమ్మాడు. అయితే కేన్రిన్ అనే సంస్థను నడిపే వ్యక్తి స్వయాన రాజ్ కుంద్రాకు బావమరిది కావడమనేది దర్యాప్తులో వెలుగు చూసింది.. అపప్టినుండి రాజ్ కుంద్రా బిజినెస్ వ్యవహారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌పై దృష్టి పెట్టిన ఈడీ.. తాజాగా రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికి వచ్చిన రాజ్ కుంద్రా మల్లి శిల్ప శెట్టి తో కలిసి కనిపించడం కానీ, అలాగే మీడియా ముందుకు రావడం కానీ, మీడియాకి చిక్కడం కానీ లేదు, చాలా సీక్రెట్ గానే రాజ్ కుంద్రా ఉంటున్నాడు. మళ్ళీ ఈడీ కేసులో మరోసారి రాజ్ కుంద్రా న్యూస్ లోకి వచ్చాడు.

అయితే తాజాగా ఈడీ పెట్టిన కేసులో రాజ్ కుంద్రా మరోసారి జైలు కి వెళ్లే అవకాశం లేకపోలేదు అంటున్నారు.

Shilpa Shetty husband Raj Kundra will go to jail again?:

ED books Shilpa Shetty husband Raj Kundra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs