Advertisement
Google Ads BL

బిగ్ బాస్: ఆ విషయంలో బిందు మాధవి గ్రేటే


బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పుడు అందరిలో అదే చర్చ. ఈ వారం ముగియబోతున్న బిస్ బాస్ లో ఫైనల్ గా విన్నర్ ఎవరూ ఫిక్స్ అవలేదు. బిందు మాధవికి అఖిల్ కి మధ్యన గట్టి పోటీ నడుస్తుంది. ఈ రోజు రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. దానితో ఫైనల్ విన్నరెవరో రేపటికి తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఎపిసోడ్ పూర్తయ్యేవరకు ఎవ్వరూ విన్నర్ పై ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. అయితే అఖిల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కానీ బిందు మాధవికి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాకే ఆమె అట తీరు చూసి, ఆమె బిహేవియర్ చూసి చాలామంది ఫాన్స్ ఏర్పడ్డారు. స్ట్రాంగ్ గా ఆడపులిగా బిందు మాధవి నామినేషన్స్ లో స్టాండ్ తీసుకోవడం, అఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ తో పోటీకి దిగడం వంటి విషయాలతో హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

అందుకే సోషల్ మీడియాలో బిందు మాధవి అభిమాన గణం ఆమె బిగ్ బాస్ కి వెళ్లాకే పెరిగింది. బిందు మాధవికి బిగ్ బాస్ కి వెళ్ళాక గత నెలలో లక్షమంది కన్నా ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు అంటే ఆమె నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అందరి కంటే ఎక్కువగా బిందుమాధవి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. మరోపక్క అఖిల్ కి బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వెళ్ళాక అభిమానుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల అయితే కనిపించలేదు. కానీ బిందు మాధవికి అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. అఖిల్ తో పోల్చుకుంటే.. బిగ్ బాస్ లోకి వచ్చాక బిందు క్రేజ్ పదిరెట్లు పెరిగింది అని, ఆమె విన్నర్ గా ట్రోఫీ అందుకోకపోయినా.. ఆమెకి భారీ క్రేజ్ మాత్రం వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. 

Bigg Boss Non Stop: Bindu Madhavi is great in that regard:

 Bigg Boss OTT: Social media craze for Bindu Madhavi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs