కొరటాల శివ కెరీర్ లోనే ఆచార్య సినిమా చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నాలుగు సినిమాలు వరసగా సక్సెస్ లు ఉన్న ఆయనకి ఆచార్య బిగ్ షాక్ ఇచ్చింది. అటు చిరు, ఇటు చరణ్ ఇద్దరికి ఈ సినిమా ప్లాప్ ఇచ్చింది. కొంతమంది రాధే శ్యామ్ కన్నా ఆచార్య డిసాస్టర్ అంటుంటే.. మెగా ఫాన్స్ ఆచార్య ని దగా చేసారని కొందరు అంటున్నారు. ఇక ఆచార్య సినిమా ప్లాప్ అవడంతో ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడ్డారు. ఆ విషయాన్ని స్వయానా చిరుకి లేఖలు రాసి మరీ తెలిపారు. అయితే రామ్ చరణ్ ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను ఎంతో కొంత సెటిల్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఇక కొరటాల కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నారట. చిరు అమెరికా టూర్ వెళ్లడంతో.. రామ్ చరణ్, కొరటాల ఇద్దరూ ఆచార్య బయ్యర్లకి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఆచార్యకి వన్ అఫ్ ద ప్రొడ్యూసర్. అలాగే కొరటాల ఫ్రెండ్ నిరంజన్ రెడ్డి కూడా ఆచార్య ని ప్రొడ్యూస్ చేసారు. నిరంజన్ రెడ్డికి ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం రాజ్యసభ సీటు ఇవ్వడంతో ఆయన అటు పొలిటికల్ గా బిజీగా మారడంతో కొరటాల ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ తో సెటిల్మెంట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. డిజిటల్, శాటిలైట్ హక్కులకు రావాల్సిన అమౌంట్ వచ్చాక వీలైనంత త్వరగా ఆచార్య వ్యవహారాలను చక్కబెట్టాలని కొరటాల చూస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ ని కూడా కొద్దిగా వేచి ఉండాలని కొరటాల కోరినట్టుగా తెలుస్తుంది.