Advertisement
Google Ads BL

ఎఫ్3 నుండి పూజా హెగ్డే స్పెషల్


ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3 మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ఎఫ్3 మూవీని  నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఎఫ్3లో మరింత గ్లామర్ జోడించింది పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌ గా వచ్చిన లైఫ్ అంటే ఇట్లా వుండాలా సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం క్యాచి డ్యాన్సింగ్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో స్వరపరిచిన ఈ పార్టీ సాంగ్ లో  పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటానికి అవాకాశం ఇచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ గ్రేస్ తో అదిరిపోయే మూమెంట్స్ చేశారు. నాగినీ మ్యూజిక్ కి పూజా, వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ మాస్ ని మాస్ ని అలరించేలా వుంది. సాంగ్ లో సునీల్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించి సాహిత్యం క్యాచిగా వుంది. మనిషి పెద్ద కలలు కనాలి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం ఈ పాటలో వుంది. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఫుల్ ఎనర్జీ తో ఈ పాటని ఆలపించారు. ఈ పార్టీ సాంగ్ లో పూజా హెగ్డే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Life Ante Itla Vundaalaa From F3 Featuring Pooja Hegde Unleashed:

Party Song Of The Year- Life Ante Itla Vundaalaa From F3 Featuring Pooja Hegde Unleashed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs