Advertisement
Google Ads BL

NBK107: ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫిక్స్


బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK 107 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ మాస్ అవతార్, ఆయన పవర్ ఫుల్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లుగా ఈమధ్యన వార్తలొచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా NBK 107 కోసం ఓ అదిరిపోయే మాస్ బీట్ ఉన్న ఐటెం సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేశారట.

Advertisement
CJ Advs

మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ లో బాలయ్య తో పాటుగా చంద్రిక  రవి కాలు కడపనుందట. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా.. ఈ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో చేస్తారని.. ఈ సాంగ్ షూట్ అవ్వగానే NBK 107 టీం యుఎస్ షెడ్యూల్ కోసం బయలు దేరుతుంది అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ యుఎస్ లో 20 రోజులు పాటు సాగనుంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా బాలయ్య తో జాయిన్ అవ్వనుంది అని సమాచారం.

NBK107: Heroine Fix for Item Song:

Chandrika Ravi special number in NBK107 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs