రామ్ చరణ్ - శంకర్ కలయికలో క్రేజీ మూవీ గా మూడు భాషల్లో దిల్ రాజు నిర్మిస్తున్న RC 15 షూటింగ్ చిత్రీకరణ నిన్నమొన్నటివరకు చాలా వేగంగానే జరిగింది. రీసెంట్ గా వైజాగ్ లో పూర్తి చేసిన షెడ్యూల్ తో ఈ సినిమాకి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. వైజాగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన చరణ్ అండ్ శంకర్ లు తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్, మారేడుమిల్లిలో ప్లాన్ చేశారట. అయితే RC 15 ని ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేస్తారు.. రామ్ చరణ్ సంక్రాంతి బరిలో దిగడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు దిల్ రాజు RC 15 రిలీజ్ ప్లాన్ లో మార్పులు చేశారట. ఎందుకంటే దిల్ రాజు మరో మూవీ సంక్రాంతి కే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. వంశి పైడిపల్లి - విజయ్ కలయికలో తెరకెక్కుతున్న Thalapathy 65 మూవీ ని సంక్రాంతికే అంటే తమిళంలో కూడా పొంగల్ కే రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ ప్రకటన ఇవ్వడంతో మళ్లీ దిల్ రాజు తనకి తానే ఎందుకు పోటీ పడతారు.. అందుకే RC15 సమ్మర్ బరిలో నిలిపేందుకు ప్లాన్ చెయ్యడంతో.. అలా ఇప్పుడు RC 15 ప్లాన్ చేంజ్ అయ్యింది అంటున్నారు.