Advertisement
Google Ads BL

RRR ని కాపీ చేస్తున్న KGF2


అటు ట్రిపుల్ ఆర్, ఇటు KGF 2 రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేసిన సినిమాలే. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ట్రిపుల్ ఆర్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా కొల్లగొడితే.. తర్వాత వచ్చిన కెజిఫ్ చాప్టర్ 2 కూడా అదే సంచలన విజయాన్ని నమోదు చేస్తూ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా 50 రోజుల తర్వాత జీ 5 ఓటిటి నుండి సౌత్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మే 20 న జీ 5 లో ట్రిపుల్ ఆర్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంటే.. ట్రిపుల్ ఆర్ ఫాన్స్ ఆనందంతో పండగ చేసుకోవడానికి లేకుండా.. జీ 5 లో ఆర్ ఆర్ ఆర్ ని చూడాలంటే డబ్బులు చెల్లించాలని అంటున్నారు. అంటే జీ 5 ఓటిటి యాప్ ఉన్నా సరే.. కొంత అమౌంట్ పే చేసిన తర్వాత ట్రిపుల్ ఆర్ ని ఆడియన్స్ చూసేందుకు వీలుంటుంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ని చూసి కెజిఫ్ చాప్టర్ 2 ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా KGF 2 ని అమెజాన్ లో చూడాలంటే 199 రూపాయాలు ఎర్లీ యాక్సెస్ పేరిట డబ్బులు చెల్లించాలనే కండిషన్ పెట్టింది. అంటే KGF 2 ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చినా.. దానిని అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ చూడడానికి కూడా199 రూపాయలు చెల్లించాలట. కెజిఫ్ 2 ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెచ్చినా ఈ 199 రూపాయలు పే చెయ్యడం అనేది కొత్తగా అనిపిస్తుంది. ఈ 199 రూపాయలను పెట్టి కొన్న వారికి కెజిఫ్ 2 అమెజాన్ ప్రైమ్ లో ఓ నెల పాటుగా అందుబాటులో ఉంటుంది. అలాగే KGF 2 చూడడం స్టార్ట్ చేసాక ఓ 48 గంటల్లో దానిని చూసెయ్యాలి. లేదంటే దాని గడువు కూడా ముగిసిపోతుంది అనే కండిషన్ అమెజాన్ పెట్టడంతో.. #KGF2 is available on rent for ₹199 on Amazon Prime Video. Cheruku gada ni malli malli machine lo petti juice teestunnaru.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

KGF 2 is now available to rent on Prime video in:

Yash KGF 2 is now available on Amazon Prime Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs