Advertisement
Google Ads BL

KGF రాఖి భాయ్ కన్నా దారుణంగా ప్రభాస్


కెజిఫ్ చాప్టర్ 1, కెజిఫ్ చాప్టర్ 2 రెండిటిలో హీరో యశ్ రాఖి భాయ్ గా పవర్ ఫుల్ మాస్ లుక్ లో రౌడీనా.. లేదా హీరోనా.. అన్న రేంజ్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ కేరెక్టర్ ని డిజైన్ చేసారు. KGF గనుల్లో రాఖి భాయ్ గా యశ్ లుక్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్ కూడా ముచ్చటపడిపోయారు. పెరిగిన గెడ్డంతో, లాంగ్ హెయిర్ తో యశ్ నిజంగా రౌడీ మాదిరిగా కనిపించాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ సలార్ లోను ప్రభాస్ ని అంతే మాస్ గా ప్రెజెంట్ చేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ లోనూ చూసాం, అలాగే ప్రభాస్ సలార్ లీకెడ్ పిక్స్ లోనూ చూసాం.

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా సలార్ నుండి ప్రభాస్ మరో లుక్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ లుక్ లీకయిన వెంటనే వైరల్ కాకుండా ఆపినా అప్పటికే ఆ లుక్ పై ఫాన్స్ న్యూస్ లు స్ప్రెడ్ చేసారని, ఆ లీకెడ్ లుక్ లో ప్రభాస్ KGF లో యశ్ కన్నా దారుణమైన మాస్ లుక్ లో ఉన్నారని, ప్ర‌భాస్ గ‌డ్డంతో కనిపిస్తున్నారని, ప్రభాస్ లీకెడ్ పిక్ లో ఆయన లుక్ పీక్స్ అని, KGF లో యశ్ ని మించి ప్రభాస్ కటౌట్ కి సరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ఆ లుక్ చూసిన ఫాన్స్ చెబుతున్న మాట. ఇక ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ సలార్ లో చాలా క్రూరంగా కాస్త నెగెటివ్ గానే కనిపిస్తారని చెప్పారు కూడా. మరి ప్రశాంత్ నీల్ మాటలకి ప్రభాస్ లుక్ ని కలిపితే.. ఆ రేంజ్, ఆ క్రేజ్ వేరు అనేలా ఉంది. 

Prabhas Salaar leaked pic viral:

Prabhas intense and rugged look leaked from the sets of Salaar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs