కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్ హీరోలపై, అలాగే స్టార్ కిడ్స్ పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉంటుంది. మొన్నీమధ్యనే మహేష్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకు మీడియా తీసిన పెడర్ధాలకు కంగనా గట్టిగా కౌంటర్ వేసింది. మహేష్ ఇష్టం ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు, మహేష్ మాట్లాడిన దానిలో తప్పేం లేదు అంటూ మహేష్ ని స్పోర్ట్ చేసింది. తాజాగా కంగనా ధకడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న కంగనా రౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడమే కాదు.. సౌత్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
సౌత్ హీరోలు అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. సౌత్ హీరోలాంటి ఎలాంటి కేరెక్టర్ చెయ్యడానికైనా రెడీ. ఈమధ్యనే పాన్ ఇండియాలో రిలీజ్ అయిన పుష్ప సినిమా లో హీరో ఎర్రచందనం దుంగలు నరికే కూలీగా కనిపించారు. బాలీవుడ్ హీరోలు ఈమధ్య కాలంలో అలాంటి ఏరెక్టర్ చేసింది లేదు. సౌత్ లో సంస్కృతీ, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతే ఆ సినిమాలను ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈమధ్యన బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని స్టార్ కిడ్స్ నటించినవే. వాళ్ళు చిన్నప్పటినుండి చదువు, యాక్టింగ్ కోసం విదేశాలకు వెళ్లి ఇక్కడికి వచ్చి సినిమాల్లో నటిస్తారు. అంటే వాళ్ళు విదేశాలనుండి రావడంతో వాళ్ళ అలవాట్లు, పద్ధతులు అన్ని డిఫ్రెంట్ గా ఉంటాయి, వాళ్ళు సినిమాల్లోకి వచ్చాక వాళ్ళ లుక్స్, ఉడికిపోయిన కోడి గుడ్లు లా ఉంటారు.. అంటూ బాలీవుడ్ స్టార్ హీరోలపై, స్టార్ కిడ్స్ పై సంచలన కామెంట్స్ చేసింది.