Advertisement
Google Ads BL

KGF 3 పై కలగాపులగం వార్తలు


నిన్న ఈ సమయానికి KGF 3 పై సెన్సేషనల్ న్యూస్ అంటూ ఆ సినిమా నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కెజిఎఫ్ చాప్టర్2 తో వరల్డ్ వైడ్ గా అద్భుతమైన హిట్ కొట్టడం, దానికి సీక్వెల్ గా KGF 3 వస్తుంది అనే అప్ డేట్ రావడంతో.. మాస్ ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ సలార్, తర్వాత ఎన్టీఆర్ మూవీస్ కమిట్మెంట్ తో బిజీగా ఉన్నారు. KGF 3 అప్పుడే ఉండదులే అనుకుంటే.. హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్‌ మాత్రం అక్టోబర్ నుండి KGF 3 షూటింగ్ మొదలై 2024 లో సినిమా రిలీజ్ ఉంటుంది అంటూ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

దానితో KGF ఫాన్స్ తెగ ఆనందపడిపోయారు. ఈలోపు హోంబలే ఫిలిమ్స్ లో మరో నిర్మాత కార్తిక్‌ గౌడ మాత్రం KGF 3 ఇప్పట్లో ఉండదు. మా నిర్మాణ సంస్థలో చాలా మంచి ప్రాజెక్ట్స్ తెరకెక్కాల్సి ఉన్నాయి, సోషల్ మీడియాలో కేజిఫ్ 3 పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ప్రస్తుతం మా నుండి రాబోయే ప్రాజెక్ట్స్ పైనే మా దృష్టి ఉంది, కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ కేజీఎఫ్‌ 3ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.. అంటూ తికమక పెట్టడంతో.. KGF 3 పై వస్తున్న ఈ కలగాపులగం న్యూస్  లపై ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

KGF producers do a U-turn on KGF Chapter 3:

KGF Chapter 3 won't be starting anytime soon, says producer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs