Advertisement
Google Ads BL

యంగ్ హీరో పెళ్లి: కొద్దిమందికే ఆహ్వానం


కోలీవుడ్ యంగ్ హీరో ఆది పిన్నిశెట్టి.. తాను ప్రేమిస్తున్న హీరోయిన్ నిక్కీ గల్రానితో మార్చ్ లో ఎంగేజ్మెంట్ చేసున్న విషయాన్ని రెండు రోజుల తర్వాత బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని కొంతకాలంగా ప్రేమలో ఉండడం, పెద్దలను ఒప్పించి వివాహనికి సిద్దమైన విషయాన్ని వీరిరువురూ ఎంగేజ్మెంట్ తర్వాతే ప్రకటించారు. అయితే మార్చ్ లో సింపుల్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట అతి త్వరలోనే అంటే మే 18 న పెళ్లి పీటలెక్కబోతుంది. అది కూడా చెన్నై లోని నక్షత్ర హోటల్లో అంటూ ప్రచారం జరగడమే కానీ.. పినిశెట్టి ఫ్యామిలీ కానీ, గల్రాని ఫ్యామిలీ కానీ స్పందించలేదు.

Advertisement
CJ Advs

అయితే ఆది పినిశెట్టి- నిక్కీ గల్రాని లు తమ పెళ్లి విషయమై ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికి తెలియజేసారు. తమ పెళ్లి కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ లోని కొద్దిమంది స్నేహితుల మధ్యనే జరగబోతుంది అని, చాలా తక్కువమంది సభ్యుల సమక్షంలోనే తమ పెళ్ళికి జరగబోతున్నప్పటికీ.. మీ అందరి ఆశీర్వాదం కావాలనే తాము ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ఆది పినిశెట్టి చెప్పారు. మరి మే 18 న ఆది - నిక్కీ గల్రాని వివాహ వేడుక చాలా సింపుల్ గా చాలాకొద్దిమంది అతిథుల  సమక్షంలోనే జరగబోతుంది అనేది పూర్తి స్పష్టత వచ్చేసింది.

Aadhi Pinisetty press meet about his wedding:

Aadhi Pinisetty & Nikki Galrani kickstart wedding celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs