Advertisement
Google Ads BL

దేవరకొండని తెగ పొగుడుతున్న బాలీవుడ్ భామ


విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ భామలకు పిచ్చ క్రేజు. లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ పార్టీలు, బాలీవుడ్ స్నేహాలు బోలెడన్ని ఉన్నాయి. కరణ్ జోహార్ పార్టీలకి విజయ్ దేవరకొండ మిస్ అవకుండా హాజరవుతారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ చేసాడు. ఆ సినిమాలో విజయ్ కి జోడిగా అనన్య పాండే నటించింది. లైగర్ గ్లిమ్ప్స్ లో అనన్య పాండే పెద్దగా కనిపించకపోయినా లైగర్ లీకెడ్ పిక్స్ లో విజయ దేవరకొండ తో గట్టి రొమాన్స్ నే పండించింది.

Advertisement
CJ Advs

లైగర్ షూటింగ్ పూర్తయ్యింది, ఆ సినిమా ఆగష్టు లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే అనన్య పాండే విజయ్ దేవరకొండ ని ఓ రేంజ్ లో పొగిడేసింది. విజయ్‌ దేవరకొండది చాలా దయాగుణమని, విజయ్ చాలా మంచి వ్యక్తి అని చెప్పిన అనన్య పాండే.. విజయ్ నేను సెట్‌లో సరదాగా ఉండేవాళ్లం. అమెరికాలో లైగర్‌ షూటింగ్‌ చిత్రీకరణ రోజులని నెను ఎ‍ప్పటికీ మర్చిపోలేను అంటూ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Ananya Pandey raves about Vijay Devarakonda:

Ananya Opens Up On Working With Vijay Devarakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs