Advertisement
Google Ads BL

ఫైనల్ వార్నింగ్ ఇస్తున్న రామ్ ద వారియర్


సత్య... సత్య ఐపీఎస్!

Advertisement
CJ Advs

డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్. 

ఆయన అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్. 

వయలెంట్‌గా కొడతాడు! వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు!

అతడి కథేంటో తెలియాలంటే... ముందు ది వారియర్ టీజర్ చూడాల్సిందే.

సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ నటిస్తున్న సినిమా ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

ది వారియర్ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. 

ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం అప్ప! ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య అని ఒకడు వ‌చ్చున్నాడు... వాడియమ్మా! ఒక్కొక్కడికి పెడుతున్నాడు. కానీ, ఒకటప్పా... కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు. అట్టా కొడతాడు... టాబ్లెట్ ఇస్తాడు అని నటుడు రిడిన్ కింగ్‌స్లే చెబుతుంటే... స్క్రీన్ మీద పవర్‌ఫుల్‌గా రామ్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. 

యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్‌లో చోటు ఇచ్చారు. డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను అని కృతి శెట్టి చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ఆట బానే ఉంది, ఆడేద్దాం అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి.

పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?, మై డియర్ గ్యాంగ్‌స్ట‌ర్స్‌ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 

ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్ళను కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం అని హీరో రామ్‌తో నదియా ఒక మాట చెబుతారు. అందులో ఎమోషన్, ఫైర్... రెండూ ఉన్నాయి. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో హీరో ఏం చేశాడు? ఎవరిని వెతుక్కుంటూ వెళ్లి కొట్టాడు? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

మాస్... ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్  చూస్తే అర్థం అయ్యింది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ది వారియర్ టీజర్ వైరల్ అయ్యింది.  

The Warriorr Teaser is here:

Ram The Warriorr Teaser released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs