Advertisement
Google Ads BL

అమ్మో రష్మిక ఎక్కడా ఆగడం లేదుగా


లక్కీ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజినే కాదు, అవి కూడా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో పుష్ప హిట్ తర్వాత అమ్మడు లక్కీ ఇంకా ఇంకా పెరిగిపోయింది. శ్రీవల్లి గా డీ గ్లామర్ గా రశ్మికని చూసిన బాలీవుడ్ స్టార్స్ సైతం పడిపోయారు. అంతేకాదు.. తమిళనాట రష్మిక కి విజయ్ - వంశి పైడిపల్లి కాంబోలో మొదలైన Thalapathy 66 లో బంపర్ ఆఫర్ తగిలింది. ఆ సినిమా ఓపెనింగ్ రోజునే తానెంతో లక్కీగా అంటూ విజయ్ ని పెంపర్ చేసింది కూడా. ఇక బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ఆనిమల్ లో రణబీర్ కపూర్ సరసన ఛాన్స్ పట్టేసింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా విజయ్ - వంశి పైడిపల్లి కలయికలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తెగ ఎగ్జైట్ అవుతుంది. మేకప్ వేసుకుని షూటింగ్ కోసం రెడీ అయ్యాను, లోపల నుండి పిలుపొచ్చింది.. లోపలి వెళ్లి సెట్స్ లో హీరో విజయ్ తో పాటుగా దర్శకుడు వంశీని చిత్ర బృందాన్ని కలిసాను, రోజంతా వారితో గడపడం చాలా హ్యాపీ హ్యాపీ గా ఉంది అంటూ రష్మిక సోషల్ మీడియాలో విజయ్ తో తన మొదటి రోజు వర్క్ గురించి షేర్ చేసింది. ప్రస్తుతం వంశి పైడిపల్లి - విజయ్ VIjay66 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. మరి విజయ్ తో సినిమా అన్నప్పటినుండి రష్మిక ఎక్కడా ఆగడం లేదు. తన లక్కు మీద తనకే నమ్మకంగా బాగా పెరిగినట్టుగా బిహేవ్ చేస్తుంది.

Rashmika Mandanna joins Vijay on the sets of Thalapathy 66:

Thalapathy 66 update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs