Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లో నటరాజ్ మాస్టర్ అతి


బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో మొదటినుండి టాస్క్ లో సూపర్ పెరఫార్మెన్స్ తో రెచ్చిపోయే నటరాజ్ మాస్టర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తారనే విషయం ఆ నాన్ స్టాప్ ఫాలో అవుతున్న ప్రేక్షకుల అందరికి తెలుసు. నటరాజ్ మాస్టర్ ఓవర్ గా ఎమోషనల్ అవుతుంటాడు. తనకి ఎవరు సపోర్ట్ చెయ్యకపోయినా, లేదంటే ఎవరైనా తనని నామినేట్ చేసినా ఇక అయన మాటలు తట్టుకోవడం చాలా కష్టం. సీజన్ మొదలైనప్పటినుండి బిందు మాధవికి, యాంకర్ శివ కి నటరాజ్ మాస్టర్ తో పొసగదు. గత సీజన్ లోను నటరాజ్ మాస్టర్ అతి వలనే ఆయన తొందరగా ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి తన పాపని వదిలేసి వచ్చి గేమ్ ఆడుతున్నా అంటూ అతి చేస్తున్నాడు. ఎవరైనా ఏదో ఒక త్యాగం చేసి క్రేజ్ కోసం, మనీ కోసమో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతారు కానీ, త్యాగాలు చేసి ఎవ్వరూ రారు.

Advertisement
CJ Advs

అయితే టాస్క్ విషయం వచ్చేసరికి రాక్షసుడిలా మారిపోయి కష్టపడి గేమ్ ఆడతాడు. అది ఎవరూ కాదనరు. కానీ ఇలాంటి విషయాల్లో నటరాజ్ చేసే అతి చూసి హౌస్ మేట్స్ మాత్రమే కాదు, ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు. గత రాత్రి ఫ్లవర్ రైన్ టాస్క్ లో నటరాజ్ కష్టపడి ఆడి అనిల్ తో పోటీగా నిలిచాడు. ముందుగా మిత్ర, బాబా ఆ గేమ్ నుండి తప్పుకోగా, తర్వాత బిందు, శివ ఓడిపోయారు. ఫైనల్ గా అఖిల్, నటరాజ్, అనిల్ ఉండగా.. అనిల్, నటరాజ్ పోటాపోటీ కాదు నిజంగా నటరాజే ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అఖిల్ ఎలాగూ అవుట్ అవుతానని తెలిసి తన ఫ్లవర్స్ ని అనిల్ కి ఇచ్చేసాడు. దానితో నటరాజ్ కష్టపడి ఆడినా ఎవరూ హెల్ప్ చెయ్యడం లేదు, నన్ను చంపెయ్ దేవుడా అంటూ తెగ అతి చేసాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచుని అఖిల్ మోసం చేసాడు అని, అనిల్ ని గెలిపించాడు అంటూ అరిచిగోల చేసాడు. పాపని ఒదిలేసి ఆడుతున్నా అంటూ ఓవర్ చేసాడు. 

తర్వాత అఖిల్ తో వాదించాడు, అరియనా వచ్చి సరిచెప్పినా నటరాజ్ ఒప్పుకోలేదు. తర్వాత బాబా భాస్కర్ అఖిల్ ఏమిట్రా అలా అనిల్ ని సపోర్ట్ చేసావ్ అని అడిగాడు. అది కాదు మాస్టర్ అనిల్ కి నేను ఇంతకుముందు ఏం చెయ్యలేదు. అందుకే ఇలా, మాస్టర్ కి చాలాసార్లు హెల్ప్ చేశా, మాస్టర్ నాకు చేసారు. చెల్లుకి చెల్లు అన్నాడు. కానీ నటరాజ్ మాస్టర్ అతి అంతా ఈ ఎపిసోడ్ లోనే బయటికి వచ్చేసింది.

Nataraj Master Athi in Bigg Boss:

Bigg Boss Non Stop: Yesterday episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs