Advertisement
Google Ads BL

ఆ డైలాగే సర్కారు వారికి శాపమా


మహేష్ నటించిన సర్కారు వారి పాట రిలీజ్ అయ్యింది.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ పెరఫార్మెన్స్, ఆయన లుక్స్, థమన్ సాంగ్స్, సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఎంత బావున్నా సెకండ్ హాఫ్ లో విషయం లేకపోవడం, థమన్ నేపధ్య సంగీతం, కథనం అన్ని సినిమాకి మైనస్ లుగా నిలిచాయి. అయితే ఇక్కడ సర్కారు వారి పాట రిలీజ్ అవ్వకుండానే.. ఓవర్సీస్ లో షోస్ పడుతున్న సమయంలో అంటే సర్కారు వారి పాట టాక్ బయటికి రాకముందు నుండి సోషల్ మీడియాలో #DisadterSVP హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ మహేష్ యాంటీ ఫాన్స్ హడావిడి చేసారు. సినిమా టాక్ వచ్చాక కూడా అదే హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎందుకు మహేష్ సినిమా అంటే అంత కక్ష, మరీ అంతలా నెగెటివిటి స్ప్రెడ్ చెయ్యాలా అనే అనుమానం అందరిలో వచ్చింది. 

Advertisement
CJ Advs

అయితే ఇక్కడ సర్కారు వారి పాట కి అంతలా నెగెటివి స్ప్రెడ్ చెయ్యడానికి ఆ సినిమాలో ఉన్న ఓ చిన్న డైలాగే ఏమో అనే అనుమానం అందరిలో స్టార్ట్ అయ్యింది. సర్కారు వారి పాట మూవీలో ఏపీ సీఎం జగన్ సీఎం కాకముందు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన డైలాగ్ ని మహేష్ చేత చెప్పించారు పరశురామ్. అంతే కాకుండా YSR అన్నా, జగన్ అన్నా.. ఆయన పని చేసే విధానం అన్నా తనకి ఇష్టం కాబట్టే ఆ డైలాగ్ పెట్టాను అన్నారు పరశురామ్. అయితే సర్కారు వారి పాటలో అలా సీఎం జగన్ డైలాగ్ చెప్పడమే ఆ సినిమాకి శాపంగా మారింది అని, ఏపీలో జగన్ ప్రభుత్వానికి పెరిగిన వ్యతిరేఖత ఎఫెక్ట్ ఇప్పుడు సర్కారు వారి పాటపై చూపించారు అని భావిస్తున్నారు. యాంటీ జగన్ ఫాన్స్ కావాలనే సర్కారు వారి పాట కి #Disaster టాగ్ తగిలించారని.. ఆ డైలాగ్ పెట్టకుండా ఉంటే బావుండేది అని, అలాగే జగన్ చాలా సింపుల్ గా ఉంటారు, అందుకే నచ్చుతారు అంటూ మహేష్ ప్రమోషన్స్ లో భజన చెయ్యకుండా ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది అంటూ ఏదెదో మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు, సోషల్ మీడియా, ఇండస్ట్రీ జనాలు.

Sarkaru Vaari Paata: DisasterSVP trends on opening day:

DisasterSVP trends on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs