మహేష్ బాబు - పరశురామ్ కలయికలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సర్కారు వారి పాట నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. సినిమాకి మాస్ ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ పడింది, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో మహేష్ వన్ మాన్ షో అంటూ మహేష్ పెరఫార్మెన్స్ ని, ఆయన డాన్స్ ని పొగిడేస్తున్నారు. మహేష్ బాబు చాలా అందంగా స్క్రీన్ మీద కనిపించారని, మహేష్ కనిపించిన ప్రతిసారి ఫాన్స్ విజిల్స్ వేస్తూ పేపర్స్ ఎగరేస్తూ రెచ్చిపోయి ఎంజాయ్ చేసారు. థమన్ మ్యూజిక్ లో మూడు పాటలు సూపర్ హిట్ అని, సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ అనేలా ఉంది అంటూ సినిమాకి మంచి టాక్ ఇచ్చేసారు ఆడియన్స్. మంచి బజ్ తో విడుదలైన సర్కారు వారి పాటకి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. నైజాం దగ్గర నుండి నెల్లూరు వరకు సర్కారు వారి పాట డే 1 కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 12.24
సీడెడ్ - 4.70
ఉత్తరాంధ్ర - 3.73
ఈస్ట్ - 3.25
వెస్ట్ - 3.00
గుంటూరు - 5.83
కృష్ణా - 2.58
నెల్లూరు - 1.56
ఏపీ&టీస్ డే1 షేర్ : 36.89Cr