మహేష్ బాబు బాలీవుడ్ లో తాను సినిమాలు చేసి టైం వెస్ట్ చేసుకోను అని, బాలీవుడ్ తనని భరించలేదు అంటూ చేసిన వ్యాఖ్యలను నేషనల్ మీడియా, బాలీవుడ్ మీడియా చిలవలు పలవలు చేసి.. మహేష్ మాటలను వక్రీకరించి మరీ స్ప్రెడ్ చేస్తున్నాయి. మహేష్ వ్యాఖ్యలపై మీడియా లో వస్తున్న వార్తలకు అయన ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చారు. నేను ఏ ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు, బాలీవుడ్ ని నేను తక్కువ చెయ్యలేదు అని చెప్పినా నేషనల్ మీడియాలో మహేష్ న్యూస్ లు ఆగడం లేదు. బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్.. అది మహేష్ వ్యక్తిగతం, అతను మాట్లాడిన దానిలో తప్పేం లేదని స్పందించారు. ఇలాంటి సమయంలో నేషనల్ మీడియా బాలీవుడ్ దర్శకనిర్మాత బోని కపూర్ ని మహేష్ కామెంట్స్ పై స్పందించమని కోరింది.
దానితో బోని కపూర్ నేను మహేష్ కామెంట్స్ పై స్పందించడానికి కరెక్ట్ పర్సన్ ని కాదు, ఎందుకంటే నేను సౌత్ లో మూవీస్ నిర్మిస్తున్నాను, కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాను, ఇకపై కన్నడ, మలయాళం లోను సినిమాలు నిర్మిస్తున్నాను, నేను నార్త్ వాడిని మాత్రమే కాదు, సౌత్ వాడిని కూడా.. సో ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్స్ చెయ్యలేను. అయినా మహేష్ కి ఏది అనిపిస్తే అది మాట్లాడేపూర్తి హక్కు ఉంది అంటూ మాట్లాడారు బోని.
ఇక రామ్ గోపాల్ వర్మ అయితే మహేష్ బాబు మాట్లాడింది తప్పు అనడానికి లేదు. ఎందుకంటే హీరోలు కథని ఎంచుకోవడంలో, అలాగే ఎలాంటి సినిమాలు చెయ్యాలి, ఏ భాషలో చెయ్యాలో డిసైడ్ అవడం వారి హక్కు. కాకపోతే బాలీవుడ్ తనని భరించలేదు అని మహేష్ ఎందుకు అన్నాడో ఆ విషయం తనకి అర్ధం కాలేదు అంటూ వర్మ మహేష్ కామెంట్స్ పై స్పందించారు.