Advertisement
Google Ads BL

మిస్టరీగా ఆట టీనా మరణం


ఓం కార్ యాంకరింగ్ లో జీ ఛానల్ లో ఆట అనే డాన్స్ షో ఎంతో పాపులర్ అయ్యింది. చాలా సీజన్స్ ఆట డాన్స్ షో నడిచింది. ఆట డాన్స్ షో ద్వారా చాలామంది కొరియోగ్రాఫర్స్ టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. అయితే అంట పాపులర్ అయిన ఆట సీజన్ వన్ లో ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ కి గట్టి పోటీ ఇచ్చి సీజన్ వన్ విన్నర్ గా నిలిచిన టీనా అనుమానస్పద రీతిలో ఈరోజు కన్నుమూయడం పలువురిని షాక్ కి గురి చేసింది. ఆట సీజన్ వన్ లో విన్నర్ గా నిలిచిన టీనా అదే షో సీజన్ 4 కి జేడ్జ్ గా కూడా వ్యవహరించింది. 

Advertisement
CJ Advs

అయితే టీనా హఠాత్తుగా గోవా లో గుండెపోటుతో మరణించింది అని చెబుతున్నారు. కానీ చాలా చిన్న వయసులోనే టీనా ఇలా అనుకోకుండా చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.  ఆటా లో విన్నర్ గా నిలిచిన తర్వాత టీనా కి సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పని చేసే అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్ళు టివి షోస్ లో కనబడిన టీనా చాలారోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో టీనా హఠాన్మరణం ఎవరికి అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయింది. టీనా మరణాన్ని ఆమెతో స్టేజ్ షేర్ చేసుకున్న ఆట సందీప్ సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు.

Zee Telugu Aata Judgecer Tina died:

Telugu Aata Judge dancer Tina cause of death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs