ట్రిపుల్ ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ అయ్యాయి.. ఆ సినిమా ఆల్మోస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్ కూడా పూర్తయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ నుండి కొమరం భీముడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ నటనని పొగడని వారే లేరు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ విషయంలో కాకుండా NTR30, NTR31 విషయంలో తెగ హైలెట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈనెల 20 నే కావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ పై ఆతృతగా ఉన్నారు.
NTR 30 నుండి కొరటాల ఆ సినిమా అప్ డేట్ ఇవ్వడం ఖాయం అంటుంటే.. NTR 31 దర్శకుడు ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారని, ఎన్టీఆర్ తో ఇప్పటికే ఫస్ట్ లుక్ కోసం టెస్ట్ షూట్ కూడా చేసారని, అందుకే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ హిట్ తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నారని, ఎలాగూ సలార్ కొత్త షెడ్యూల్ మొదలు కావడానికి కొద్దిగా సమయం ఉండడంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీలో ఎన్టీఆర్ లుక్ కోసం టెస్ట్ షూట్ నిర్వహించారని, ఖచ్చితంగా ఎన్టీఆర్ బర్త్ డే కి NTR31 నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రావడం ఖాయమని ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.