సొంతం సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా కనిపించి వెంకటేష్ సరసన అందంగా కనిపించిన నమిత.. ఆ తర్వాత చాలా బొద్దుగా తయారైంది. బరువు పెరిగిన నమిత కి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బాలకృష్ణ సింహ లో అవకాశం ఇచ్చినా ఆ తర్వాత నమిత కి క్రేజీ అవకాశాలు తలుపు తట్టలేదు. తమిళనాట కూడా అవకాశాలు అందిపుచ్చుకున్న నమిత అక్కడ అభిమానులతో గుడి కట్టించుకుంది. కానీ తర్వాత బరువు పెరిగిన కారణంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో 2017 నవంబర్ 24 న నమిత తన బోయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వీరేంద్ర నటుడు మరియు ప్రొడ్యూసర్ కూడా.
పెళ్లి తర్వాత నమిత సడన్ గా బరువు తగ్గింది. చాలా సన్నగా కాకపోయినా.. కాస్త నాజూగ్గా తయారైంది. అయినా నమిత కి ఆఫర్స్ అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే ఇప్పుడు నమిత ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజు మే 10 నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా.. మాతృత్వం.. నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. నేనూ మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త లైఫ్, కొత్త పిలుపులు... మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్ అంటూ.. తాను ప్రెగ్నెంట్ అని చెబుతూ ఓ అందమైన బేబీ బంప్ ఫోటో తో నమిత కన్ ఫర్మ్ చేసింది.