బాలీవుడ్ ఇప్పుడు సినిమాల విషయంలో కన్నా ఎక్కువగా.. సెలెబ్రిటీల పెళ్లి విషయంలోనే హైలెట్ అవుతుంది. నిన్నగాక మొన్న రణబీర్ - అలియా భట్ జంట పెళ్లి పీటలెక్కగా.. తర్వాత అర్జున్ కపూర్ తో మలైకా పెళ్లి విషయం తెరమీదకి రావడమే కాదు, మలైకా అరోరా ఆల్మోస్ట్ వారి పెళ్లిని కంఫర్మ్ చేసింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. ఇప్పటికే నిశ్చితార్ధం కూడా చేసుకుంది ఈ భామ. ఆమె ఎవరో కాదు హీరోయిన్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పడానికి ట్రై చేసినా.. పెద్దగా ఆమెకి స్టార్ ఛాన్సెస్ రాక.. ప్రస్తుతం వెబ్ సీరియస్ ల్లో బిజీ అయిన సోనాక్షి సిన్హా.
సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా. సోనాక్షి ఈమధ్యన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే తాజాగా సోనాక్షి సిన్హా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుని.. చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. తనకు కాబోయే భర్తను పట్టుకుని సోనాక్షి, అతని ఫేస్ కనబడకుండా కవర్ చేసింది. ఈ రోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ఒక పెద్ద కల నెరవేరబోతుంది. ఇది జరిగిందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ విషయాన్ని తెలియజేసింది.