Advertisement
Google Ads BL

లైగర్ హంట్ థీమ్ అద్దిరిపోయింది


Today #LIGER was born.. అంటూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ మూవీ నుండి విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా లైగర్ హంట్ థీమ్ ని రిలీజ్ చేసింది టీం. ఆ థీమ్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా ఎదగడానికి పడిన కష్టాలను చూపించారు. స్కిప్పింగ్ చేస్తూ.. మిడ్ నైట్ కుస్తీలు పడుతూ, అలాగే రన్నింగ్ రేస్ చేస్తూ విజయ్ దేవరకొండ అద్భుతమైన బాక్సర్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీ లో మెస్మరైజ్ చేసాడు. బాక్సింగ్ రింగ్ దగ్గర విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి రౌడీ ఫాన్స్ కిక్ రావడం ఖాయం. 

Advertisement
CJ Advs

విజయ్ దేవరకొండ ఫుల్ బాడీ ఫిట్ నెస్ తో లైగర్ లా ఈ హంట్ థీమ్ లో వేటాడే సింహాలా కనిపించారు. విజయ్ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ ని ప్రాక్టీస్ చేస్తూ ఒక యూనివర్సల్ స్టార్ లా కనిపించారు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్ గా వుంది. సిక్స్ ప్యాక్ దేహంతో బాక్సింగ్ రింగ్ లో శత్రువుని మట్టికరిపించే యోధుడిలా కనిపించారు. విజయ్ దేవరకొండ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ లైగర్ నుండి విజయ్ అందుకున్నాడు.  

ఈ హంట్ థీమ్ ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది

♪♪ బతకాలంటే గెలవాల్సిందే

ఎగరాలంటే రగలాల్సిందే

నువ్వు పుట్టిందే గెలిచెటందుకు

దునియా చమడాల్ వలిచెటందుకు

అది గుర్తుంటే ఇంకేం చూడకు

ఎవడు మిగలడు ఎదురుపడెందుకు

ఛల్ లైగర్.. హంట్.. ♪♪ అంటూ సాగింది.

కరణ్ జోహార్, పూరి, ఛార్మి నిర్మాతలు అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన లైగర్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో టీం బిజీగా వుంది. ఆగష్టు లో లైగర్ పాన్ ఇండియా ఫిలిం గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. 

LIGER (Saala Crossbreed) Hunt Theme Out:

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur LIGER (Saala Crossbreed) Hunt Theme Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs